Ysrcp Suspends Kadiri Ex Mla Pv Sidda Reddy,: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యాడు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పై వైసీపీ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పని చేశారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్ధారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినట్లు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందడంతో ఆ పార్టీ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని… పార్టీ నుంచి తొలగిస్తామని కూడా… ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పార్టీ ముఖ్యమని.. పనిచేసే నాయకులకు మంచి స్థానం కల్పిస్తామని కూడా తెలిపారు. పార్టీ నుంచి వెళ్ళిపోయేవారు… పోవచ్చు అని.. కానీ వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారట జగన్మోహన్ రెడ్డి.