చిన్నారుల మరణాలపై పుతిన్‌ వద్ద మోదీ ఆందోళన.. అమెరికా రియాక్షన్ ఏంటంటే?

-

అంతర్జాతీయ అంచనాలకు తగ్గట్టే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వద్ద ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఉక్రెయిన్‌లో రెండ్రోజుల క్రితం రష్యా జరిపిన క్షిపణి దాడిలో పలువురు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిగురించి పుతిన్‌ వద్ద మోదీ ప్రస్తావిస్తూ చిన్నారుల మరణాలు తనను కదిలించాయని ఆందోళన వ్యక్తంచేశారు.

‘‘యుద్ధం, ఘర్షణలు, ఉగ్రవాద ఘటనలు ఏవైనాకానీ.. వాటివల్ల సాధారణ పౌరులు మరణిస్తే మరీ ముఖ్యంగా అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోతే.. మానవత్వాన్ని విశ్వసించే ప్రతీ వ్యక్తి బాధ పడతారు. అలాంటి బాధ కలిగినప్పుడు హృదయం ద్రవిస్తుంది. భారత్‌ శాంతి వైపే ఉందని మీతో పాటు అంతర్జాతీయ సమాజానికి హామీ ఇస్తున్నాను. భేటీలో మీ మాటలు నాకు నమ్మకాన్ని ఇచ్చాయి. భావితరాలకు మెరుగైన భవిష్యత్తు ఉండాలంటే శాంతి అత్యావశ్యకం. బాంబులు, గన్స్‌, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావు’’ అని పుతిన్ వద్ద వ్యాఖ్యానించారు.

మోదీ-పుతిన్ భేటీపై స్పందించిన అమెరికా  ఉక్రెయిన్‌తో యద్ధం ముగించాలని పుతిన్‌ను కోరే చొరవ భారత్‌కు ఉందని పేర్కొంది. అందుకు ఆ రెండు దేశాల మధ్య ఉన్న బంధమే కారణమని వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news