శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి ‘స్థానిక కోటా’లో వైసీపీ విజయం

-

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుతం వైస్సార్సీపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వెలువడిన రెండు ఫలితాల్లో ఈ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు.

శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితం వెలువడింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. ఈ ఎన్నికలో మొత్తం 752మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు వేయగా.. రామారావుకు 632 ఓట్లువచ్చాయి.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. వైస్సార్సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంగకా రవీంద్రనాథ్‌ విజయం సాధించారు. మొత్తం 1105 ఓట్లు ఉండగా.. 1088 మందిస్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. వైస్సార్సీపీకి చెందిన కవురు శ్రీనివాస్‌కు 481 మొదటిప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. వంకా రవీంద్రనరాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యకర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version