ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇసుక డోర్ డెలివరీ కి సంబంధించిన మొబైల్ యాప్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొబైల్ యాప్ ను ఇసుకను డెలివరీ చేస్తున్న జేపీ గ్రూప్ రూపొందించింది. అంతే కాకుండా ఈ యాప్ కు ఆంధ్రా సాండ్ యాప్ అని పేరు పెట్టారు. ఇక ఈ మొబైల్ యాప్ తో నేరుగా ఇసుక బుకింగ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
అంతే కాకుండా ఆంధ్రా సాండ్ యాప్ పేరుతో వెబ్ సైట్ ను కూడా రూపొందించింది. ఇక వెబ్ సైట్ లో లేదంటే మొబైల్ యాప్ లో ఏవైనా అనుమానాలు ఉంటే 9700009944 అనే హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఇక ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్న తరవాత ఇసుక ఎక్కడి వరకు వచ్చింది అనే విషయాన్ని కూడా ట్రాక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దానికోసం యాప్ కు జీపీఎస్ ను లింక్ చేసింది. ఇక ఈ యాప్ ద్వారా ఇది వరకు ఇసుక బుక్ చేసుకోవాలంటే ఎదురుకున్న కష్టాలు తొలగనున్నాయి. అంతే కాకుండా దళారుల నుండి సైతం తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఇసుక ధరలు కూడా పారదర్శకంగా కనిపించే అవకాశం ఉంది.