పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా ప్రతి రోజూ పెరగడం సామాన్యుడిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇది వరకు ఎప్పుడో ఒకసారి పెరిగే ధరలు ఇప్పడు ప్రతి రోజూ పెరుగుతూ ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా 30 నుండి 36 పైసల మధ్య పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర ఈరోజు 40 పైసలు దాటేసింది. ఇక తాజాగా ఈరోజు పెరిగిన ధరలతో పెట్రోల్ రేటు హైదరాబాద్ లో రూ.114.13 కు చేరుకుంది.
అంతే కాకుండా డీజిల్ ధర రూ. 107.40 కు చేరుకుంది. నిన్న పెట్రోల్ పై 35 పైసలు పెరగ్గా….డీజిల్ పై 37 పైసలు పెరిగింది. ఇక ప్రతి రోజూ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగటం తో నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. రవాణా చార్జీలు పెరగటం తో ఆ ప్రభావం నిత్యావసర వస్తువులపై సైతం పడుతోంది. దాంతో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇక పెరిగిన ధరలకు కారణం గత ప్రభుత్వాలు అంటూ మోడీ సర్కార్ చెబుతుండగా…వచ్చిన పదేళ్లలో ఏం చేశారని ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి.