కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొద్దీ ఎక్కువ అవుతున్న తరుణంలో చాలా కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వం అమలు చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడానికి చైనా దేశం అనుసరించిన విధానాన్ని అనుసరిస్తోంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే చైనా దేశంలో వూహాన్ లో వైరస్ ప్రభావం భయంకరంగా ఉన్న టైంలో కంటైన్ మెంట్ జోన్లుగా, వైరస్ ఎక్కువగా ప్రభావితం చెందే ప్రాంతాలను ఎంచుకుంది. కంటైన్ మెంట్ జోన్లుగా వాటిని గుర్తించి ఎక్కడికక్కడ రహదారులను మూసివేసి ఏ ఇంటిలో నుండి వ్యక్తులు బయటకు రాకుండా ఇంటికి తాళాలు వేసి అధికారులు తమ చేతుల్లోనే తాళాలు పెట్టుకుంటారు.
చాలా వరకు గద్వాల్లో కరోనా ప్రభావం తగ్గింది. తెలంగాణలో సూపర్ హిట్ అయిన ఈ ఐడియా ఏపీలో అమలు చేయాలని డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. కర్నూల్ మరియు గుంటూరు అదేవిధంగా కృష్ణాజిల్లాలో వైరస్ కేసులు ఎక్కువ బయట పడుతున్న తరుణంలో రెడ్ జోన్ కలిగిన ప్రాంతాల ఇళ్లకు తాళాలు వేయాలని అంటున్నారు. ఇదే సమయంలో అధికారులే ఇంటికి వచ్చి నిత్యావసర వస్తువుల్ని అందిస్తారు, కాబట్టి ఎవరికీ ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదని అంటున్నారు. మరి తెలంగాణ ఐడియాను ఏపీ ప్రభుత్వం ఫాలో అవుతుందో లేదో చూడాలి.