Andhrapradesh : సమ్మె వాయిదా వేసే ప్రసక్తే లేదు… తేల్చి చెప్పిన అంగన్వాడి సంఘాలు

-

గత కొన్ని రోజులుగా వేతనాలు పెంచాలని అంగన్వాడి కార్యకర్తలు సమ్మె చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అంగన్వాడి సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జరిపిన చర్చలు విఫలం అయినాయి.వేతనాలు పెంచి,గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితి లేదని 1.64 లక్షల మందికి వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని పేర్కొంది. సంక్రాంతి పండుగ తర్వాత ఈ అంశంపై మరోసారి చర్చలు జరుపుతామని, అప్పటి వరకు సమ్మె విరమించాలని మంత్రి బొత్స కోరారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీ సంఘాలు తేల్చి చెప్పాయి.

సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ….“మాది మహిళా పక్షపాత ప్రభుత్వం. వేతనాల పెంపునకు కొంత సమయం అడిగాము అని తెలిపారు.చర్చలు విఫలమవడంతో ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించినట్టు అంగన్వాడీ సంఘాలు తెలిపాయి.గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నామని ఇప్పటికే 4 సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఎలాంటి ఫలితంలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నుంచి ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడి చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news