ప్రభుత్వ ఉద్యోగాలపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే వయోపరిమితిని ఐదేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మే 31వ తేదీతో వయోపరిమితి ముగిసింది. కాగా 2016 మే31 వరకు ప్రభుత్వం వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిని పెంచి ఓసీ, ఈబీసీ, బీసీ అభ్యర్థులకు సడలింపు ఇవ్వకపోవడం పై నిరుద్యోగ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లుగా తాము ఉద్యోగాల కోసం చదువుతున్నామని అన్ని వర్గాల వారికి వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు కూడా వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిరుద్యోగుల డిమాండ్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.