వినాయకచవితి ఉత్సవాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వినాయకచవితి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలని వైద్యాధికారులు సూచించారు. కరోనా నేపథ్యంలో ఉత్సవాలకు..ఊరేగింపులకు దూరంగా ఉండాలని చెప్పారు. ఇళ్లలో విగ్రహాలు పెట్టుకునేందకు అనుమతి ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
అంతే కాకుండా కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ ను రాత్రి 11 గంటల నుండి ఉదయం 6గంటల వరకూ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో వ్యాక్సిన్ లు వేసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రబావాలు ఉన్నాయో తెలుసుకోవాలని వైద్యాధికారులకు సీఏం ఆదేశించారు. బూస్టర్ డోస్ తీసుకోవాలంటూ సమాచారం వస్తుందని..దానిపై అనుసరించే వ్యూహాలపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ లు ఇవ్వడం పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.