ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రం సేఫ్ గా ఉందని భావించిన పాలకులు ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఏ విధంగా కట్టడి అవుతుందో అర్ధం కాని పరిస్థితిలో ఏపీ సర్కార్ ఉంది. చూస్తూ చూస్తూనే కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుంది.

దీనితో రాష్ట్రంలో శానిటైజర్ ల కొరత ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. శానిటైజర్ల తయారీ బాధ్యతను ఏపీ ప్రభుత్వం మద్యం డిస్టిల్లరీలకు అప్పగించింది. వాటి కొరతను తగ్గించడానికి గానూ.. ఎక్సైజ్‌ శాఖ లైసెన్సులు మంజూరు చేసింది. రాష్ట్రంలో 17 డిస్టిలరీలు ఉండగా వాటికి శానిటైజర్లను తయారు చేసేందుకు లైసెన్సులు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ.

నాలుగు డిస్టిలరీల్లో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించారు కూడా. అదే విధంగా వాటి తయారికి దరఖాస్తు చేసుకున్న 10 ఫార్మా కంపెనీలకూ లైసెన్సులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వీటి తయారికి అవసరం అయ్యే… రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ మద్యం డిస్టల్లరీలో పెద్ద ఎత్తున అందుబాటులో ఉంటుంది. రెక్టిఫైడ్‌ స్పిరిట్‌లో ఎక్కువగా ఆల్కహాల్, ఇథనాల్‌ ఉంటాయి. ఇవి బ్యాక్తీరియాను చంపుతాయి. అయితే ఫార్మా కంపెనీలకు మాత్రం రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ వాడేందుకు అనుమతి ఉండదు.

దీనిని వినియోగించాలి అంటే మాత్ర౦ ఆర్‌ఎస్‌–3 లైసెన్స్‌ తప్పనిసరి. శానిటైజర్ల తయారీకి రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ కావాలని ఎవరు దరఖాస్తు చేసుకున్నా సరే రెండు గంటల్లోపే అనుమతులిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మీడియాకు వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 14 కి చేరుకుంది. విజయవాడ సహా కడప జిల్లాలో కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version