జగన్ కన్నెర్ర చేస్తే.. రోడ్డు మీద తిరగగలుగుతారా ? : ఏపీ మంత్రి

-

సీఎం జగన్ నిజంగా కన్నెర్ర చేస్తే మీరు రోడ్డు మీద తిరగగలుగుతారా? అచ్చెన్నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే… 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. ప్రజల్లోకి వెళదాం… మీ సీట్లు మీకు మిగులుతాయో లేదో చూసుకుందామన్నారు. ఓటమి తప్పదని ముందే టీడీపీ పారిపోయిందని…. ఎన్నికలు బహిష్కరిస్తామని డ్రామాలు చేసిందని మండిపడ్డారు.

రెండేళ్ల జగన్ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి చూసి ఒక నమ్మకంతో మద్దతు ఇస్తున్నారని… నామినేషన్ వేసుకునే దిక్కులేని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. ప్రజలు 80 శాతం వైసీపీకి మద్దతు ఇచ్చారని… ముఖ్యమంత్రి పై నోటికి వచ్చినట్లు అయ్యన్నపాత్రుడి మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు.  మేము కూడా తిట్టగలం, మాకు భాష వచ్చని… హెచ్చరించారు. పాత్రకు సొట్టలేసినట్లు అయ్యన్నపాత్రుడికి వేయగలమని పేర్కొన్నారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. అయ్యన్నపాత్రుడు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version