రోహిత్ శర్మను తెగ పొగిడిన అనిల్ కుంబ్లే… !

-

నిన్న రాత్రి ముగిసిన మొదటి వన్ డే లో ఇండియా ఇన్నింగ్స్ విజయాన్ని సాధించింది. రెండు ఇన్నింగ్స్ లలో భరత్ స్కోర్ కంటే లోపే ఆల్ అవుట్ చేసి విజయాన్ని ఖరారు చేసింది. ఈ విజయంలో రోహిత్ శర్మ మరియు జైస్వాల్ లు సెంచరీ లతో ఆకట్టుకున్నారు. ఇక అశ్విన్ మ్యాచ్ మొత్తం లో వికెట్లు తీసి విండీస్ వెన్ను విరిచాడు. కాగా రోహిత్ శర్మను మాజీ ఇండియా కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసలతో ముంచెత్తాడు. ఈయన మాట్లాడుతూ రోహిత్ శర్మ ఇంతకు ముందు మ్యాచ్ లలో లాగా కాకుండా.. ఈ మ్యాచ్ లో చాలా ఓపికగా, జాగ్రత్తగా పరుగు పరుగు జోడించి తన ఇన్నింగ్స్ ను నిర్మించాడని పొగిడారు. తాను ఆడుతున్న సమయంలో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆడడంలో రోహిత్ సక్సెస్ అయ్యాడని కుంబ్లే కితాబిచ్చాడు. ఈ టెస్ట్ లో రోహిత్ సాధించిన సెంచరీ అతనికి చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

ముందు ముందు మ్యాచ్ లలో మరిన్ని పరుగులు చేసి ఇండియా విజయాలకు కారణమవ్వాలని కోరాడు. కాగా ఈ రెండవ టెస్ట్ 20వ తేదీ నుండి పోర్ట్ అఫ్ స్పెయిన్ వేదికగా జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version