బైబై కేసీఆర్..బైబై బాబు లాగా వర్కౌట్ అవుతుందా?

-

రాజకీయాల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో పార్టీలు ముందుకొస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రజల్లోకి బాగా వెళ్ళేలా కొన్ని స్లోగన్స్ కూడా పెడుతున్నారు. అయితే ఈ స్లోగన్స్ కార్యక్రమం గత ఏపీ ఎన్నికల ముందు నడిచింది. ఓ వైపు వైసీపీ బైబై బాబు అంటూ స్లోగన్ ఇవ్వగా, టి‌డి‌పి ఏమో మళ్ళీ నువ్వే రావాలి అంటూ స్లోగన్ ఇచ్చింది.

ఇలా ఎవరి స్లోగన్స్ వారు వినిపించారు. కానీ ప్రజల్లోకి బైబై బాబు అనేది ఎక్కువ వెళ్లింది. దీంతో ప్రజలు చంద్రబాబుని గద్దె దింపి..జగన్‌ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్‌ని గద్దె దించడానికి టి‌డి‌పి…సైకో పోవాలి..సైకిల్ రావాలి, బాబుతోనే భవిష్యత్ అంటూ స్లోగన్స్ ఇస్తుంది. ఇక వైసీపీ ఏమో జగనన్న మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ అంటుంటే..అటు జనసేన ఏమో హలో ఏపీ..బైబై వైసీపీ అని నినదిస్తుంది. ఇలా ఏపీలో స్లోగన్స్ నడుస్తున్నాయి.

top

ఇక తెలంగాణలో కూడా ఈ స్లోగన్స్ కార్యక్రమం నడుస్తుంది. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అంటూ బి‌ఆర్‌ఎస్ అంటుంది. బి‌జే‌పి ఏమో సాలు దొర, సెలవు దొర అని అంటుంది. కాంగ్రెస్ ఏమో బైబై కేసీఆర్ అని చెబుతుంది. తాజాగా ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి మరోసారి స్పందిస్తూ.. “ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంది..ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ చేసే అవినీతిని అంతం చేస్తుంది’’అని ట్వీట్ చేసి..బైబై కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. మరి బైబై కేసీఆర్ ఎంతవరకు పనిచేస్తుంది…కే‌సి‌ఆర్ గద్దె దిగి..కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version