‘యానిమల్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే ఈ సినిమాపై బాలీవుడ్లో భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో వివాదాస్పదమయ్యాయి. యానిమల్‌ను విమర్శించిన ప్రముఖ రచయిత జావేద్ అక్తర్, హీరోయిన్ కంగనా రనౌత్, ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్‌లపై సందీప్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్.. మీర్జాపుర్ సిరీస్‌లో అభ్యంతరకరమైన పదాలు చాలా ఉన్నాయని, కొన్ని సీన్స్ చూసే తనకు వాంతి వచ్చిన ఫీలింగ్ కలిగిందని అన్నారు. ఆ సిరీస్ నిర్మించిన ఫర్హాన్ అక్తర్ (జావేద్ అక్తర్ కుమారుడు)కు జావేద్‌ను సలహా ఇవ్వమనండి అంటూ ఘాటు కామెంట్స్ చేశారు.
ఇదే ఇంటర్వ్యూలో సందీప్ .. కంగనా రనౌత్ గురించి మాట్లాడుతూ ఆమె తన మూవీపై నెగిటివ్ రివ్యూ ఇచ్చినా తనకేం ఇబ్బంది లేదని తాను తీయనున్న సినిమాలో సరిపోయే పాత్ర ఏదైనా ఉంటే స్టోరీ చెబుతానని అన్నారు. మరోవైపు ఇటీల కిరణ్ రావుపై సందీప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తాను ప్రత్యేకించి సందీప్ చిత్రాల గురించి మాట్లాడలేదని.. తన సినిమాల గురించే మాట్లాడుతున్నానని ఆయన ఎందుకు ఊహించుకున్నారో తెలియదని అన్నారు.