భారత ఫేస్‌బుక్ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత, దక్షిణ మధ్య ఆసియా పబ్లిక్ పాలసీ డైరక్టర్ అంఖీదాస్… తన పదవికి రాజీనామా చేశారు. ప్రజాసేవపై ఉన్న ఆసక్తితో అంఖి దాస్… తన పదవి నుంచి వైదొలిగారు. ఎలాంటి వివాదాస్పద కారణాలు లేవని ఫేస్‌బుక్ సంస్థ యాజమాన్యం తెలిపింది.
ఫేస్‌బుక్ ఇండియాలో 9 ఏళ్లపాటు పనిచేసిన అంఖిదాస్.. సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని వెల్లడించింది.భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి అని ఆకాంక్షించింది. ఓ జాతీయ పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా వ్యవహరించినట్లు అంఖిదాస్‌పై ఆరోపణలు వచ్చిన కొద్ది నెలల్లోనే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.