నవంబర్‌లో బ్యాంక్‌లు మొత్తం నాలుగు ఆదివారాలు, రెండు శనివారాల్లో మూసి ఉండనున్నాయి. ఇక నవంబర్‌లో పండుగలు బాగానే ఉన్నాయి కనుక సెలవులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నవంబర్ లో దీపావళి, గురునానక్ జయంతి ఉన్నాయి. కనుక ఆయా రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సెలవులన్నీ పబ్లిక్, ప్రైవేటు బ్యాంకులకు వర్తిస్తాయి. ఇక నవంబర్ నెలలో బ్యాంకులకు ఉండనున్న సెలవుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నవంబర్ 1 – ఆదివారం
నవంబర్ 8 – ఆదివారం
నవంబర్ 14 – రెండో శనివారం, దీపావళి
నవంబర్ 15 – ఆదివారం
నవంబర్ 22 – ఆదివారం
నవంబర్ 28 – నాలుగో శనివారం
నవంబర్ 29 – ఆదివారం
నవంబర్ 30 – గురునానక్ జయంతి
మొత్తంగా నవంబర్ నెలలో 8 బ్యాంకు సెలవులు రానున్నాయి. అయితే ఆదివారాలు, శనివారాలు తప్ప మిగిలిన సెలవుల తేదీలు మారే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆయా పండుగలప్పుడు ప్రభుత్వం ప్రకటించే సెలవు దినాల గురించి తెలుసుకోవాలి.