ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. దానిపై జనసేన పార్టీ ఏ ముందుగా స్పందించిందన్నారు. సీఎం సొంత జిల్లాలో ఈ ఘటన జరిగినా ప్రభుత్వం కనీసం స్పందించ లేదని మండిపడ్డారు. బాధితులకి మూడు నెలల్లో ఇళ్లు కట్టిస్తామన్నారు.. రూ. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ.. ఏడాది పూర్తైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.
అన్నమయ్య డ్యామ్ వద్ద లష్కరుగా ఉన్న రామయ్య అధికారులను, ప్రజలను అలెర్ట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని అన్నారు నాదెండ్ల మనోహర్. వందలాది మంది ప్రజల ప్రాణాలను లష్కర్ రామయ్య కాపాడారని పేర్కొన్నారు. రామయ్య ఫోన్లు చేయడం వల్లే చాలా మంది ప్రాణాలు కాపాడుకోగలిగారని తెలిపారు. రామయ్య ఇల్లు కూడా వరదకు కొట్టుకుపోయిందన్నారు. అలాంటి రామయ్యని సత్కరించడం జనసేన బాధ్యతగా భావిస్తోందన్నారు నాదెండ్ల మనోహర్.