సూపర్‌ త్రో స్వర్ణాన్ని సాధించిన అన్ను రాణి

-

ఆసియా క్రీడల్లో భారత్‌ క్రీడాకారులు స్వర్ణాలను వరుసగా గెలుచుకుంటూ పోతున్నారు. అయితే.. తాజాగా మరో గోల్డ్‌ మెడల్‌ భారత్‌ ఖాతాలో చేరింది. అయితే.. ఆసియా క్రీడల్లో భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి సంచలన ప్రదర్శన కనబర్చింది. చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అన్ను రాణి అదిరిపోయే త్రో విసిరి పసిడి పతకం చేజిక్కించుకుంది.

ఈ సీజన్ లోనే తన బెస్ట్ త్రో నమోదు చేసిన అన్ను రాణి జావెలిన్ ను 62.92 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకుంది. అన్ను రాణి తన నాలుగో ప్రయత్నంలో ఈ సూపర్ త్రో విసిరింది. 61.57 మీటర్లతో శ్రీలంక క్రీడాకారిణి నదీష దిల్హాన్ రజతం గెలుచుకుంది. చైనాకు చెందిన హుయిహుయి ల్యూ 61.29 మీటర్లతో కాంస్యం దక్కించుకుంది. కాగా, అన్ను రాణి గెలుచుకున్న స్వర్ణంతో, ఆసియా క్రీడల్లో భారత్ పసిడి పతకాల సంఖ్య 15కి పెరిగింది.

ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్‌ పారుల్‌ చౌదరి అద్భుతం చేసింది. మంగళవారం సాయంత్రం జరిగిన 5000 మీటర్ల రన్నింగ్ ఫైనల్ ను కేవలం 15 నిమిషాల 14.75 సెకన్‌లలో పూర్తిచేసింది. తద్వారా తొలి స్థానంలో నిలిచి భారత్ కు స్వర్ణాన్ని అందించింది. ఆసియా గేమ్స్ లో పారుల్ కు ఇది రెండో పతకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version