మహేష్ బాబు “గుంటూరుకారం” రిలీజ్ డేట్ ఫిక్స్.. అనౌన్స్ చేసిన మేకర్స్ !

-

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు కు ఒక రేంజ్ ఉంది.. టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న మహేష్ బాబు వరుస సినిమాలతో ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఇక తాజాగా మహేష్ బాబు హీరోగా మరియు శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “గుంటూరు కారం”. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ ఐన పోస్టర్స్, టీజర్ లు ప్రేక్షకులనుం ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ యూనిట్ నుండి ఒక లేటెస్ట్ సమాచారం పోస్ట్ చేశారు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం.. ఈ అప్డేట్ ప్రకారం వచ్చే సంవత్సరం జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగకు కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఆ విధంగా చూస్తే ఈ సినిమా రిలీజ్ కు 100 రోజులు సమయం ఉంది. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version