హైదరాబాద్ కు మరో 229 టన్నులు అమోనియం నైట్రేట్..!

-

తమిళనాడు రాజధాని చెన్నై ఓడరేవులో నిల్వ ఉన్న దాదాపు 697 టన్నుల అమోనియం నైట్రేట్ తరలింపులో భాగంగా మరో 229 టన్నులు హైదరాబాద్​కు చేరనుంది. తొలి దశలో 200 టన్నులను తరలించారు.చెన్నైలో నిల్వ ఉన్న అమోనియం నైట్రేట్​ను ఈ-వేలంలో హైదరాబాద్​కు చెందిన సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో దశలవారీగా తరలింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు. పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌లో అమోనియం నైట్రేట్‌ను ఎక్కడ భద్రపరుస్తారనే అంశంపై వివరణ ఇచ్చారు సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ ప్రతినిధి. అధికారులు తనిఖీలు చేశారని, ప్రమాదం ఏమీలేదని చెప్పుకొచ్చారు. సరైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అమోనియం నైట్రేట్​ తరలింపునకు అన్ని అనుమతులు ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పేలుడు పదార్థాన్ని సింగరేణి, ఇతర క్వారీలకు సరఫరా చేస్తామని వివరించారు. మిగిలిన నిల్వలను పెసో ప్రమాణాలకు అనుగుణంగా భద్రపరుస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version