వైఎస్ వివేకా హత్యలో మరో ట్విస్ట్..కీలక నిందితుడు అరెస్ట్ !

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌ రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకా నంద‌రెడ్డి హ‌త్య కేసు లో దేవి రెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు.

హైద‌రాబాద్‌ లో ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి ని ఇవాళ మధ్యాహంన అదుపు లోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. అరెస్ట్‌ చేసిన అనంతరం… దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి ని కోఠి లోని సిబిఐ కార్యాలయానికి త‌ర‌లించారు అధికారులు.

కాగా… మూడు రోజుల కింద ఈ కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌ రెడ్డి డ్రైవర్‌ దస్తగిరి సిబిఐ అధికారుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ఈ కేసులో కీలక విషయాలను తెలిపాడు దస్తగిరి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌ రెడ్డి హత్యకు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి కారణమన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version