వివాహేతర సంబంధాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా వారి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని కట్టుకున్న వారిని చంపేస్తున్నారు. ఇలా చేయడం నేటి కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం… పిల్లలను, భర్తను వదిలి వారితో వెళ్లిపోవడం లేదా అడ్డువస్తే వారిని చంపడానికి సైతం వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మహిళ.
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగింది. రాజు, మౌనిక అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే మౌనిక ఉదయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తన భర్తకు తెలిసి మందలించగా అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. తన భర్త భోజనంలో నిద్ర మాత్రలు కలిపింది. అనంతరం తన ప్రియుడితో పాటు మరొక వ్యక్తి సహాయంతో తన భర్తకు ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో రాజు, మౌనిక, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.