కేసీఆర్ పై పోటీ చేసిన నర్సారెడ్డిని తరిమికొట్టిన కాంగ్రెస్ నాయకులు

-

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు మితిమీరుతున్నాయి. మైనంపల్లి హనుమంతరావు, తూంకుంట నర్సారెడ్డి మధ్య విబేధాలు ముదురుతున్నాయి. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసేందుకు వచ్చిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిని తరిమికొట్టారు దళిత మహిళలు, నాయకులు.

Congress leaders ousted Narsa Reddy, who contested against KCR
Congress leaders ousted Narsa Reddy, who contested against KCR

దళిత ద్రోహి నర్సారెడ్డి డౌన్ డౌన్ అంటూ ఉరికించారు దళిత సంఘం నాయకులు. దింతో అక్కడి నుంచి పారిపోయారు గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సారెడ్డి. అంతకు ముందు మంత్రి వివేక్ వెంకటస్వామి ముందే కాంగ్రెస్ పార్టీ నాయకుడి చెంప చెల్లుమనిపించారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. ఒక దళిత మంత్రి ముందే దళితుడిని కొట్టడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు దళిత సంఘాలు. కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న నర్సారెడ్డి విధానాన్ని ఖండిస్తున్నారు గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news