పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.అయితే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, అక్డి పక్డి సాంగ్, అఫట్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రం నుండి మూడో సాంగును విడుదల చేయనున్నట్లు హీరో విజయ్ దేవరకొండ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కోకా 2.0 అనే పాటని నేడు ( శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ ఎలా ఉంటుందోనని అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది.
Tomorrow.
Coka 🔥#Liger pic.twitter.com/fjpsNc5UOe— Vijay Deverakonda (@TheDeverakonda) August 11, 2022