బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె తన అందాలను ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటుంది. అందుకే గ్లామర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. కేవలం బుల్లితెరపై కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని రోజుల వరకు ఎక్స్ట్రా జబర్దస్త్ కు మాత్రమే యాంకర్ గా వ్యవహరించిన రష్మీ.. సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.
ఇక రష్మీ కూడా అదే ఫోటోను చించేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఎపిసోడ్ లో ఆది గారు నన్ను హే రష్మి ఎప్పుడొచ్చావు అని అడగలేదని. ఎప్పుడు వెళ్తున్నావని అడిగారని చెప్పుకొచ్చింది. ఇక రష్మీ ఆది మీరు ఎవరి ఫోటో ను కాల్చబోతున్నారు అని అడగగా..ఆది ఎవరి ఫోటోను కాల్చారో ప్రోమో లో కట్ చేశారు. ఇక ఈ ప్రోమో కాస్త వైరల్ అవుతోంది.