వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిపై మరో కేసు..

-

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిపై కడప జిల్లా ప్రొద్దుటూరులో మరో కేసు నమోదైంది. ఓ కేసు విషయంలో విచారణకు కోర్టులో అనుమతి కోరుతూ పోలీసులు పీటీ వారెంట్ ఫైల్ చేశారు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న వర్రాను ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం తిరిగి ఆయన్ను జైలులో అప్పగించనున్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే వర్రాను కడపలోని సెంట్రల్ జైలులో పోలీసులు ఉంచారు. ఇదిలాఉండగా అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news