ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేసుపై నేటి నుంచి ఈడీ విచారణ షురూ కానుంది. నేడు ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డి రానున్నారు. శుక్రవారం ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రానున్నారు. ఫార్ములా ఈలో నిధుల బదలాయింపుపై ఆరా తీయనున్నారు అధికారులు.
ఇద్దరి అధికారుల స్టేట్ మెంట్ ఆధారంగా… ఈ నెల 7న కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ రేస్ కేసులో కీలకమైన నిధుల బదిలీపై బీఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించనున్న ED…. తొలి ఒప్పందం పురపాలక శాఖ, ఎస్ S-Next Gen కంపెనీ, FEO మధ్య జరిగిన నేపథ్యం లో HMDA నుంచి నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అని ప్రశ్నించనుంది. మొదటి ఇన్వాయిస్ ప్రకారం 22,69,63,125, రెండో ఇన్వాయిస్ ప్రకారం 23,01,97,500 చెల్లించాలని రాతపూర్వక ఆదేశాలు ఎవరు ఇచ్చారు? అనే అంశాలతో పలు అక్రమాలపై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది.