తెలుగు సినిమాలను అడ్డుకుంటాం – తమిళ సినీ దర్శకులు

-

వారసుడు సినిమా వివాదం ముదురుతోంది. విజయ్‌ హీరోగా సినిమా దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అయితే, తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా సినిమా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది యూనిట్‌ . అటు డబ్బింగ్‌ సినిమాలు విడుదల చేయొద్దని..లేఖ విడుదల చేసింది తెలుగు సినీ నిర్మాతల మండలి.

దీంతో లేఖపై తీవ్రంగా మండిపడుతున్నారు తమిళ సినీ దర్శకులు. తెలుగు సినిమాలు తమిళనాడులో.. ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదలవుతున్నాయి.. తమిళ సినిమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. మేం కూడా తెలుగు సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దర్శక, నిర్మాతలు ఇద్దరూ తెలుగు వారే..హీరో మాత్రమే తమిళ నటుడు అని…సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఏం చేస్తోంది..భాషపరంగా విద్వేషాలు వస్తాయని పేర్కొన్నారు. దీంతో వారసుడు సినిమా విడుదల పై సస్పెన్షన్ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version