మణిరత్నంకు ప్రాణం పోసిన పొన్నియిన్ సెల్వన్.! అరుదైన రికార్డ్.!

-

మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం పాన్ఇండియా వ్యాప్తంగా విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఫలితంగా రజినీకాంత్ నటించిన రోబో 2.0 తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సాధించింది.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు 50 అద్భుతమైన రోజుల్లో పొన్నియిన్ సెల్వన్ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ వసూళ్లతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం అత్యదిక కలెక్షన్లు రాబట్టిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్-2 సరసన చేరింది. అంతేకాకుండా ఈ ఏడాది 500 పైచిలుకు వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది.

ఇక ఈ సినిమా రెండో భాగం వచ్చే సంవత్సరం సమ్మర్ సీజన్ లో విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మణిరత్నం లెజెండ్ నటుడు కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నాను అని ప్రకటించారు. విచిత్రంగా ఇటు కమల్, మణిరత్నం ఇద్దరి సినిమా కెరియర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ సినిమా ల ద్వారా వారికి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇక వీరి తర్వాత సినిమా ఎప్పుడు వస్తుందా అని వారి అభిమానుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version