తమిళనాడు పోలీసులు….రాక్షసులు…! పోలీస్ కస్టడీలో మరో దారుణం…!

-

తమిళనాడు లో జయరాజ్ ఫెనిక్స్ ల ఘటన మరువక ముందే మరో కస్టడీ ఘటన చోటు చేసుకుంది. ఈసారి ప్రాణాలు తీయలేదు కానీ కాళ్ళు చేతులు విరిచేశారు. తాము కొట్టినట్టుగా మీడియాకు కానీ జడ్జీకి కానీ చెబితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు పోలీసులు. ఈ ఘటన జూన్ లో జరిగినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… మణికందన్ (32) అనే వ్యక్తి తమిళనాడుకు చెందినవాడు. హోటల్ మేనేజర్ గా విదులు నిర్వహిస్తు కేరళలోని గురువాయుర్ లో నివసిస్తున్నాడు. అయితే ఈయన ఈ ఏడాది జనవరిలో తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో మణికందన్ పై తమిళనాడు లో ఫిర్యాదు నమోదయ్యింది.

manikandan
manikandan

ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మణికందన్ ను కేరళ నుండి తమిళనాడుకు తీసుకొచ్చారు. తిరుచెందూర్ పోలీస్ స్టేషన్ లో కస్టడీ లో పెట్టుకొని దాదాపుగా ఉదయం 6 నుండి సాయంత్రం 3 దాకా మూడు లాఠీలు విరిగెదాకా కొట్టారు. లాఠీ దెబ్బలకు అప్పటికే మణికందన్ కాలు విరిగిపోయింది. ఆపై సాయంత్రం 5 కు మరో రౌండ్ ప్రారంభించారు ఈసారి మణికందన్ చేతిని కిటికీకి స్థంబానికి మధ్య కట్టేసి ఇనుప రాడ్లతో కొట్టారు. విచక్షణా రహితంగా బాదడంతో మణికందన్ చేతులు వీరిగిపోయాయి. మర్నాడు జడ్జీ ముందర మణికందన్ తో కాలు జారీ పడ్డట్టుగా అబద్దం కూడా చెప్పించారు పోలీస్లు. ఆపై జైలుకు తరలించారు. జయరాజ్ ఫెనిక్స్ ఘటన జరిగిన తరువాతా జైల్లోని ముద్దాయిలతో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకునేందుకు తమిళనాడు హై కోర్టు ఓ జడ్జీని ఇన్స్ ఫెక్షన్ కు పంపింది. ఆ జడ్జీ మణికందన్ ను చూసి అసలు ఆ గాయాలు ఎలా జరిగాయని ప్రశ్నించగా అసలు విషయం బయటకొచ్చింది. మణికందన్ ను హింసించిన పోలీసులపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం మణికందన్ ను పోలీస్ ప్రొటెక్షన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news