లోకేష్ నెక్స్ట్ ఓదార్పు యాత్ర ఫిక్స్?

-

అవినీతి కేసుల్లోనూ, అక్రమాల కేసుల్లోనూ అరెస్టయిన టీడీపీ నేతలను పరామర్శించడానికి లోకేష్ ఓదార్పు యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చిన లోకేష్.. అంతకంటే ముందుగా, అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు! ఈ క్రమంలో లోకేష్ ఈ ఓదార్పు యాత్రలతో బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి!

ప్రస్తుతానికి అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న టీడీపీ నేతల సరసన మరో మంత్రి చేరనున్నారు! కాకపోతే ఈయన మరో అడుగు ముందుకేసి హత్యా రాజకీయాల యాంగిల్ లో అరెస్టయ్యారు! అవును… వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మోకా భాస్కర్ ‌రావు హత్య కేసుకు సంబంధించి ఆరోపణలతో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం సీతాపురం జాతీయ రహదారిపై మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అలా అరెస్టు చేశారో లేదో… ఇలా బాబు మైకందుకున్నారు. కొల్లు రవీంద్ర అరెస్టు ముమ్మాటికీ జగన్‌ సర్కారు కక్షసాధింపేనని చెప్పుకొచ్చిన బాబు… కొల్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి, పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుంది కంగారు పడకండని ధైర్యం చెప్పారు! ఆఖరికి ఒక హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ప్రాధమిక సమాచారం ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినా కూడా… అది ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని బాబు అనడం దురదృష్టం అని వైకాపా నేతలు చెబుతున్న సంగతి అలా ఉంచితే… ఈ క్రమంలో కచ్చితంగా లోకేష్ నెక్స్ట్ ఓదార్పు యాత్ర మచిలీపట్నం వైపు ఉండొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news