తెలంగాణాలో మరో దిశా ఘటన…!

-

దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా షాద్ నగర్ లో జరిగిన దిశా అత్యాచారం హత్య కేసు ఘటన తర్వాత మహిళల భద్రతపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితులను కాల్చి చంపినా సరే ఈ తరహా ఘటనలు మాత్రం ఇప్పుడు తెలంగాణాలో ఆగే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. తాజాగా తెలంగాణాలో మరో దిశా ఘటన జరిగింది.

సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ లో షాప్ కి వెళ్ళిన ఒక అమ్మాయిని ముగ్గురు యువకులు కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి, నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగి ఆమెపై అత్యాచారం చేసారు. షాప్ కి వెళ్ళిన తన కుమార్తె ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లి డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి ఆచూకి కోసం ప్రయత్నం చేసారు.

తన కూతురు వద్ద సెల్ ఫోన్ ఉందని చెప్పడంతో ఆమె వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా ఆమె ఆచూకి పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి వెళ్ళగా మద్యం తాగిన ఆనవాళ్ళను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆ బాలిక పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version