మహా కుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 22లో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున టెంట్లు తగలబడుతున్నాయి. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు.
భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రయాగ్ రాజ్ పోలీసులు సైతం ఘటనా స్థలికి చేరుకుని భక్తులను శిబిరాల నుంచి దూరంగా తరలిస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా? మానవ తప్పిదమా? లేక దీనివెనుక ఎవరైనా ఉన్నారా? అని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా, నిన్న జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. 60 మంది గాయపడిన విషయం తెలిసిందే.