44 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు..!

-

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ముగిసింది. ఇందులో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన జరగనుంది. అల్లూరి జిల్లాలో 2300 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్. రూ.14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న మేఘా ఇంజనీరింగ్.. రూ.10,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదన సమర్పించింది.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు యాస్పరీ లిమిటెడ్ కు.. 972 కోట్లతో అనంతపురంలో అనంతపురం రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కు.. 1163 కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. అలాగే కర్నూలు జిల్లాలో రూ.4435 కోట్లతో ఆయానా రెన్యుబుల్ పవర్ లిమిటెడ్ కు.. యాంపిన్ సంస్థ రూ.3142 కోట్లతో ఏర్పాటు చేయనున్న 350 మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్లాంట్ కు.. 3456 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఏఈఎల్ ప్రతిపాదనకు ఆమోదం.. 2 వేల కోట్లతో అనంతపురంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటాపవర్ కు.. కాకినాడలో ఫెర్టిలైజర్ ప్లాంట్ విస్తరణకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు అనుమతి ఇచ్చారు. అయితే పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా అధికారులు ట్రాకింగ్ చేయాలన్నారు సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news