పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటన చేశాం. అక్కడ పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయి అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై నమ్మకం ఉంచిన కంపెనీలకి ధన్యవాదాలు. హైదరాబాద్ కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గతేడాది తెలంగాణ లో మొదటి సారి msme పాలసీ తీసుకొచ్చాం. దేశం లోని ఈ పాలసీ ప్రొడక్టివిటీ ఉన్న పాలసీగా పేరొందింది. రైతులకి ఉపయోగపడే విధంగా ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మినీ msme పరిశ్రమల్ని ఏర్పాటు చేయడం మా లక్ష్యం. ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో దావోస్ పర్యటన విజయవంతంగా జరిగింది.
బిలియన్ ల పెట్టుబడి తోనే పెట్టుబడులు వస్తాయన్న పరిస్థితుల్లో డీప్ సీక్ చర్చ సంచలనంగా ముందుకు వచ్చింది. తక్కువ పెట్టుబడి తో డీప్ సీక్ లాంటి ప్రాడక్ట్ తీసుకురావొచ్చు. మనదేశం లోని మేధ శక్తి తో డీప్ సీక్ లాంటి ప్రాడక్ట్ ప్రోత్సాహం అందిస్తాం. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇండ్లు ఉన్నవాళ్లు దరఖాస్తు చేస్తే నిరాశ ఎదురవుతుంది. ఇల్లు లేని నిరుపేదలకు వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.