దేశంలో మరో భారీ స్కాం వెలుగు చూసింది. గుజరాత్ రాష్ట్రం లో ఈ భారీ స్కాం బయట పడింది. రూ. 22.842 కోట్ల భారీ స్కాం తాజా గా వెలుగు లోకి వచ్చింది. కాగ గుజరాత్ లో ఉన్న ఏబీజీ షిప్ యార్డ్ ఈ భారీ స్కాంకు పాల్పడింది. దీంతో సీబీఐ అధికారులు ఈ ఏబీజీ షిప్ యార్డ్ కంపెనీపై కేసు నమోదు చేశారు. గుజరాత్ కు చెందిన ఏబీజీ షిప్ యార్డ్ కంపెనీ షిప్ యార్డుల నిర్మాణం, షిప్ ల తయారి, రీపేరుల పేరు తో బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు చూసింది.
ఈ ఏబీజీ షిప్ యార్డ్ కంపెనీ 28 బ్యాంకుల నుంచి రూ. 22,842 కోట్ల రుణాలు తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు తో పాటు మొత్తం 28 బ్యాంకుల నుంచి ఏబీజీ షిప్ యార్డ్ కంపెనీ రుణాలు తీసుకుంది. దీంతో సీబీఐ అధికారులు.. ఏబీజీ షిప్ యార్డ్ కంపెనీ డైరెక్టర్ల తో పాటు చైర్మన్ లపై కేసు నమోదు చేసింది.
ABG Shipyard owes 22,842 crore to 28 banks, the biggest bank fraud booked by CBI 👇🏻
More @ndtv pic.twitter.com/txyXo2Zcwi
— Arvind Gunasekar (@arvindgunasekar) February 12, 2022