ప్రభుత్వ పాఠశాలలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

-

ప్రభుత్వ పాఠశాలలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో మన ఊరు మన బడి,పట్టణాల్లో మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తుందని విద్యా శాఖ, ఆర్థిక శాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి ,హరీష్ రావు లు పేర్కొన్నారు.
మొదటి దశలో 35 శాతం పాఠశాలలను ఇప్పటికే గుర్తించినట్లు వాటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు తెలిపారు.

12 అంశాలతో రాష్ట్రంలోని 9123 పాఠశాలలను మొదటి దశలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో మూడు సమావేశాలు నిర్వహించాలని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు,ఎంపీ లు,ఎమ్మెల్సీలతో,జడ్పీ చైర్మన్ ల ఆధ్వర్యంలో జడ్పీటీసీ,ఎంపీపీ,లైబ్రరీ చైర్మన్ లతో, స్కూల్ మేనేజ్మెంట్ కమిటి లతో సమావేశాలు  నిర్వహించాలని మంత్రులు కలెక్టర్ల కు ఆదేశించారు. స్థానిక పట్టణ,గ్రామీణ ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, ప్రతి ఉన్నత పాఠశాల లో  ఒక గ్రంథాలయం ఉండేలా చూడాలని మంత్రులు ఆదేశించారు.

ప్రభుత్వం నుండి ఈ పథకానికి నిధుల కొరత ఉండదని ప్రత్యేక ఖాతాలు తెరిచి నిధులు ఖర్చు చేయాలన్నారు. అవసరం ఉన్న మేరకే ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధులు ఖర్చు చేయాలని,15 రోజుల్లో అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలన్నారు. ప్రతి పనికి సామాజిక తనిఖీ ఉంటుందని,అధికారుల తనిఖీలు ఉంటాయని అన్నారు. ముందుగా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని,12 అంశాల వారిగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news