ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో క్రైస్తవ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న తరుణంలో పోలీసులు మరో కీలక ఆధారాన్ని బయటపెట్టారు. మద్యం సేవించిన ప్రవీణ్..తన మరణానికి ముందు పలుమార్లు బైకు మీద నుంచి కింద పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా పాస్టర్ ప్రవీణ్ పగడాల జర్నీలో మరో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3.19 గంటలకే ప్రవీణ్ పగడాలకు యాక్సిడెంట్ అయ్యిందని.. చిల్లకల్లు దగ్గర లారీని తప్పించబోయి ప్రవీణ్ కిందపడిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యియి. అప్పుడు తృటిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, పాస్టర్ మృతి యాక్సిడెంట్ కాదని.. హత్య అని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ పగడాల జర్నీలో మరో సీసీ ఫుటేజ్
మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3.19 గంటలకే ప్రవీణ్ పగడాలకు యాక్సిడెంట్
చిల్లకల్లు దగ్గర కిందపడిపోయిన ప్రవీణ్
లారీని తప్పించబోయి డివైడర్ ను ఢీ కొట్టిన ప్రవీణ్ పగడాల
తృటిలో తప్పించుకున్న పాస్టర్ ప్రవీణ్ pic.twitter.com/NpAwJvCTqL
— BIG TV Breaking News (@bigtvtelugu) April 2, 2025