ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల మహాధర్నా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే ఎంఐఎం అటు ఇతర ఇండియా పార్టీలు… బీసీ సంఘాల నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు.

దీనిపై వెంటనే మోడీ ప్రభుత్వం దిగివచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ మహా ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీకి తెలంగాణ నేతల నిరసన సెగ తాకింది. HCU భూములను వేలం వేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో HCU భూముల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. బీజేపీ ఎంపీలు నిరసన తెలుపుతున్న చోటే.. 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో బీసీ సంఘాలు ధర్నా చేపట్టాయి.