BREAKING : సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి మరో లేఖ..వారికి రూ. 26 వేల జీతం ఇవ్వాల్సిందే

-

ప్రభుత్వం విఆర్ఏ ల డిమాండ్స్ ను వెంటనే అమలు చేయాలని సిఎం కేసీఆర్ కు లేఖ రాశారు జగ్గారెడ్డి. చాలా రోజుల నుండి విఆర్ఏ లు వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని… ఇందులో భాగంగా సమ్మె కూడా చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం వారి డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ కూడా ఇచ్చింది.వెంటనే వి ఆర్ ఏ లు కోరిన్నట్లు పే స్కేల్ పెంచాలని డిమాండ్‌ చేశారు.

10th పాస్ ఐన వారికి అటెండర్ గ్రేడ్ పే స్కేల్ పెంచి 22వేల జీతం ఇవ్వాలని.. ఇంటర్ పాస్ ఐన విఆర్ఏ లకు అసిస్టెంట్ గ్రేడ్ పే స్కేల్ ఇచ్చి 26వేల జీతం ఇవ్వాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే విఆర్ఏ లకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుందని.. ఎంఆర్వో, ఆర్డీఓ,జాయింట్ కలెక్టర్, కలెక్టర్ స్థాయి వారు కూడ వీరితో పని చేయించుకుంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా పని చేస్తూ చాలా కష్టపడుతారు…10వేల 500 రూపాయల జీతం వీరికి సరిపోవు..బైక్ లో పెట్రోల్ పోసుకొని తిరుగడానికే సరిపోతాయని చెప్పారు. ఇంత పని భారం ఉన్న విఆర్ఏ లకు ప్రభుత్వం వెంటనే పే స్కేల్ పెంచి జీతాలు ఇవ్వాలని.. విఆర్ఏ లు కోరుతున్నట్లు ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ప్రొమోషన్స్ ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news