జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివార్లలోని హెచ్‌ఎంటి ప్రాంతానికి సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు ఆర్మీ సైనికులు మరణించినట్లు పోలీసులు గురువారం జాతీయ మీడియాకు తెలిపారు. ఆర్మీ పెట్రోలింగ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు అని పోలీసులు వెల్లడించారు. భద్రతా దళాల కోసం రహదారులను పహారా కాయడానికి ఆర్మీ బృందాన్ని ఏర్పాటు చేసారు.
నాగ్రోటా సమీపంలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్ లో ట్రక్కులో దాక్కున్న నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు మృతి చెందిన కొన్ని రోజులకు ఈ దాడి జరిగింది. నాగ్రోటా కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు పెద్ద దాడిని ప్లాన్ చేస్తున్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.