Breaking : భారత్‌ ఖాతాలో మరో పతకం.. ఈ సారి కాంస్య పతకం

-

కామన్‌వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. సంకేత్ సార్గర్ రజత పతకం సాధించిన కాసేపటికే.. మరో వెయిట్ లిఫ్టర్ పి. గురురాజ కూడా మెడల్ సాధించాడు. పురుషుల 61 కేజీల విభాగంలో పోటీ పడిన గురురాజ.. స్నాచ్‌ విభాగంలో తొలి ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తాడు. రెండో ప్రయత్నంలో 118 కేజీలు ఎత్తగా.. మూడో ప్రయత్నంలో 120 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ విభాగంలో వరుసగా 144, 148, 151 కేజీలు ఎత్తాడు. మొత్తమ్మీద 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. మలేషియాకు చెందిన అంజిల్ బిన్ బిడిన్ ముహమ్మద్ 285 కేజీలతో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇదిలా ఉంటే… పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కిలోల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం నెగ్గాడు. ఈ విభాగంలో మొత్తంగా 248 కిలోలను ఎత్తిన సంకేత్.. రెండో స్థానంలో నిలిచాడు.

తొలి ప్రయత్నంలో 113 కిలోలు ఎత్తిన అతడు.. క్లీన్ అండ్ జర్క్‌లో 135 కిలోలు ఎత్తాడు. మలేషియాకు చెందిన బిబ్ అనిక్.. 249 కేజీల బరువు (107, 142 కిలోలు) ఎత్తి స్వర్ణం సాధించాడు. శ్రీలంకకు చెందిన దిలంక యోడగే 225 కిలోల బరువు ఎత్తి కాంస్యం సొంతం చేసుకున్నాడు. క్లీన్ అండ్ జర్క్‌లో భాగంగా మోచేతి ఎముక బెణకడంతో సంకేత్ ఆ ప్రయత్నంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంకేత్, బిబ్ అనిక్‌కు మధ్య తేడా ఒక కిలోనే. మహారాష్ట్రలోని సంగిల్‌కు చెందిన సర్గర్ తండ్రి పాన్ షాపు నడుపుతుండటం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version