ఫిబ్రవరి 2026లో GHMC ఎన్నికలు..4 భాగాలుగా విభజించి !

-

ఫిబ్రవరి 2026లో GHMC ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ను నాలుగు కార్పొరేషన్‌లుగా విభజించి నలుగురు మేయర్‌లు ఉంటారని కూడా ఆయన ప్రకటించారు. హైదరాబాద్ మహానగర జనాభా కోటిన్నర దాటిందని.. నగరంలో నాలుగు మేయర్ స్థానాలు ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు.

GHMC elections in February 2026

అమెరికా తరువాత అధిక బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ రూపు రేఖలు మారిపోతాయని.. రెండు నెలలో టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని నోవాటెల్ లో అసోచామ్ ఆధ్వర్యంలో అర్బన్ ఇన్ ప్రా స్ట్రక్చర్ సమిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మూసీని సుందరీకరించి ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు. మూసీ కంటే ప్రమాదకరమైన సబర్మతిని మంచినీటి సరస్సుగా మార్చారని గుర్తు చేసారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version