తెలుగులో క్రేజీ మల్టీస్టారర్. విజయ్ అండ్ బన్నీ..?

-

తెలుగులో పాన్ ఇండియా సినిమాల హవా బాగా పెరిగింది. ప్రస్తుతం పెద్ద హీరోలుగా చెప్పుకునే అందరూ పాన్ ఇండియా సినిమాల మీదే దృష్టి పెట్టారు. అంతేకాదు మల్టీస్టారర్ సినిమాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో సినిమా రూపొందుతుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే తాజాగా మరో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ హీరోలుగా ఈ మల్టీస్టారర్ ఉండనుందట.

యాత్ర సినిమా తీసి తనని తాను నిరూపించుకున్న మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వమ్ వహించనున్నాడని అంటున్నారు. ఇప్పటికైతే ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే తెలుగులో మరో క్రేజీ మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టినవారవుతారు. అదీగాక పాన్ ఇండియా లెవెల్లో ఈ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version