Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మరో జాతీయ అవార్డు..

-

హైదరాబాద్ మెట్రోకు మరో జాతీయ అవార్డు దక్కింది. మెట్రో నిర్మాణం, ఇతర అంశాలపై రూపొందించిన ఫోటో ఆల్బమ్ కు జాతీయ అవార్డు దక్కింది. 2 వేల ఫోటోలు, 800 పేజీలతో కూడిన ఆల్బమ్ ను మెట్రో అధికారులు తయారు చేశారు.

మెట్రోకు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి జరిగిన కీలక ఘట్టాలను ఫోటో ఆల్బమ్ లో పొందుపరిచారు. అగ్రిమెంట్, ప్రారంభోత్సవం, పిల్లర్లు, మెట్రో స్టేషన్లు, ట్రాక్ నిర్మాణంతో పాటు ప్రతి అంశాన్ని ఆల్బమ్ లో పొందుపరిచారు.

ఈ ఆల్బమ్ కు జాతీయ అవార్డు దక్కడంపై మెట్రో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భోపాల్ లో జరిగిన పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లో మధ్యప్రదేశ్ వైద్యశాఖ మంత్రి కైలాష్ విశ్వాస్ సారంగ్ నుంచి హైదరాబాద్ మెట్రో సిపిఆర్ఓ మల్లాది కృష్ణానంద్ అవార్డును అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version