జగిత్యాల పట్టణంలోని హోటళ్లలో మరోసారి నిర్లక్ష్యం బయట పడింది. ఓ కస్టమర్ భోజనం చేస్తుండగా అతని ఆహారంలో ఓ స్టీల్ స్ప్రింగ్ ప్రత్యక్షమైంది. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగుచూడగా.. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాడు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని హోటల్ మేనేజ్మెంట్‌ను ప్రశ్నించాడు. దీనిపై అదికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల జగిత్యాలలోని స్వాతి టిఫిన్స్‌లో ఓ కస్టమర్ ఇడ్లీ ఆర్డర్ ఇవ్వగా అందులో జెర్రీ ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. దీనిపై ఫిర్యాదు చేయగా.. హోటల్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భోజనంలో ప్రత్యక్షమైన స్టీల్ స్ప్రింగ్
జగిత్యాల పట్టణంలోని సామంతుల భోజనశాలలో ఘటన
బుధవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్ అన్నంలో స్టీల్ స్ప్రింగ్ గుర్తింపు
విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్ ఆగ్రహం… pic.twitter.com/HtlOkos6UM
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2024