కరీంనగర్ జిల్లా : దళితబంధు పథకం అమలుకు మరో రూ. 200 కోట్లు నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే రూ. 1000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని… నేడు మరో రూ. 200 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ కర్ణన్ వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గ దళిత కుటుంబాలకు బ్యాంకులలో తెలంగాణ దళిత బంధు అక్కౌంట్లు తెరిచెలా కూడా ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ కర్ణన్.
అర్హులు అయిన ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు పథకం నిధులు జమ అవుతాయని… ఆయన వివరించారు. చివరి అర్హుని వరకు దళిత బంధు పంపిణీ చేస్తామని తెలిపారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో… దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ దళిత బంధు పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి ఏకంగా 10 లక్షల రూపాయలు ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం.