21 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ : కడియం

-

బోనస్ మొత్తం బోగస్ అని ప్రతిపక్షాలు అన్నాయి. కానీ దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణది అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈనెల 26 నుండి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి 6000 చొప్పున.. పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి 12000 రైతుల అకౌంట్లో జమ కాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం మాత్రమే అవుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. పది ఏండ్లు అధికారంలో ఉన్న పెద్ద మనుషులు మాట్లాడడం విడ్డూరం. రైతులకు అండగా ఉండి వ్యవసాయాన్ని పండుగ చేయాలనేదే రేవంత్ రెడ్డి ఆలోచన. 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రంలో పంట రుణాల మాఫీ జరగలేదు. ఎక్కడైనా జరిగితే విమర్శలు చేసే ప్రతిపక్షా నాయకులు చెప్పాలి.

ఎగువ ప్రాంతంలోని కుంటలు, చెరువులు గోదావరి జలాలతో నింపాలనేదే నా ఆలోచన. నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. ఎగువ ప్రాంతాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని నింపాలని ఆలోచన చేశాను. దేవాదుల ద్వారా కొత్త నాటకం ఆడుతున్నాడని చాలామంది మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు లేకపోతే స్టేషన్ ఘనపూర్ కు బతుకు లేదు. చాలామంది మాట్లాడుతున్నారు , ప్రారంభించిన పనులు మళ్లీ ప్రారంభించడం ఏంటని.. పనులు ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతుంది మీరేం చేశారు. ఎగువ ప్రాంతాలకు సాగునీరు ఎందుకు ఇవ్వలేదు. ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలని అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి. 104 కోట్ల రూపాయలతో మూడు లిఫ్టు స్కీములను మంజూరు చేపించాను అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version