పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించకపోవడం దారుణం : రోజా

-

తాజాగా ఏపీలో గేమ్ ఛేంజర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కి వెళ్లి మణికంఠ, చరణ్ అనే ఇద్దరు అభిమానులు మరణించారు. ఈ ఘటన పై మాజీ mla RK రోజా స్పదిస్తూ.. ఈ సంఘటన చాల బాధాకరం. కానీ తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి 3 రోజులైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కనీసం పరామర్శించకపోవడం అమానవీయం అన్నారు.

తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప టీమ్ మానవత్వం తో వ్యవహరించలేదన్న పవన్ ఇప్పుడు 3 రోజులైనా మరణించిన అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణం. ఆ యువకుల తల్లులు, కుటుంబాల కన్నీటి రోదన కనిపించడం లేదా..? పరామర్శించకపోగా వీరి మరణానికి గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వెయ్యకపోవడం కారణం అంటూ చౌక బారు రాజకీయం చెయ్యడం తగునా అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు ఆమె. ఇక 7 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీ ప్రభుత్వ మే కదా..? 7 నెలలుగా ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నది మీరు కాదా.. రోడ్డు వల్ల చనిపోతే వీరిద్దరి మరణానికి మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు కారణం కాదా..? మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోండి అని పేర్కొన్నారు రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version