కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ మరియు భారత్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న తరుణంలో మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత సలహా బోర్డును పునర్‌వ్యవస్థీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
జాతీయ భద్రత సలహా బోర్డు ఛైర్మన్‌గా RAW మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించారు.ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేయగా.. అందులో సభ్యులుగా ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా(మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్), జనరల్ ఏకే సింగ్(మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్), రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా, బి.వెంకటేష్ వర్మ (రిటైర్డ్ IFS), రాజీవ్ రంజన్ వర్మ(రిటైర్డ్ IPS), మన్మోహన్ సింగ్(రిటైర్డ్ IPS)ను నియమించారు.